ఈ భూమ్మీద అతి భయంకరమైన క్రూర మృగాలు పులులు, సింహాలు. ఈ క్రూర మృగాలు ఇతర జంతువులను, మనషులను క్షణాల్లో చంపేస్తాయి. అలాంటి భయంకరమైన మృగాలతో కొందరు అప్పుడప్పుడు ఆటలు ఆడుతారు. ఆ ఆటలు చివరకు ప్రాణాల మీదకు తెస్తాయి. ఓ వ్యక్తి కూడా పెద్ద పులితో పిల్లితో ఆడినట్లు ఆడాడు. ఆ పులికి కోపం వచ్చి వెంబడించి దాడి చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దుబాయిలోని ఓ పెద్ద భవనంలో ఒక పులి ఒక వ్యక్తిని వెంటాడుతుంది. ఆ భవనంలోని మరో వ్యక్తి నిల్చున్నాడు. మరో వ్యక్తి పులి వెంబడిస్తున్న దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరిస్తున్నాడు. అయితే పులి వెంబడించిన మొదట్లో ఆ వ్యక్తి నవ్వుతూ కనిపించాడు. కానీ ఆ తర్వాత పులి మరింత పరుగెత్తడంతో అతనికి చెమటలు పట్టాయి. పులి నుంచి తప్పించుకునే క్రమంలో కింద పడిపోయాడు. అయినా సరే పులి అతన్ని వదల్లేదు. దాడి చేసింది. అయితే.. అది ఒక పెంపుడు పులి కావడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. వెన్నులో వణుకుపుట్టించే ఈ వీడియోను ‘బిలియనీర్స్ లైఫ్ స్టయిల్’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు.
అయితే దుబాయిలో పులులు, చిరుతలు, సింహాలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు. సంపన్నుల ఇంట్లో ఈ జంతువులు తరుచుగా కనిపిస్తాయి. అవి ఎవరికీ హానీ కలిగించవు. స్థానిక బీచ్‌లకు కూడా సంపన్నులు ఈ క్రూర మృగాలను తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే 2017 నుంచి ప్రయివేటు వ్యక్తులు క్రూర మృగాలను పెంచుకోవడం నిషేధించారు. కేవలం జూ పార్కులు, వైల్డ్ లైఫ్ పార్కులు, సర్కస్‌లు, రీసెర్చ్ సెంటర్లలో మాత్రమే వన్యప్రాణులను అనుమతించాలని ఆదేశాలు ఉన్నాయి.