Homeఆంధ్రప్రదేశ్జర్నలిస్టులకి ఆర్టీసి ఉచిత ప్రయాణం!?

జర్నలిస్టులకి ఆర్టీసి ఉచిత ప్రయాణం!?

Published on

రాత్రి పగలు తేడా లేకుండా సమాజ హితంకోసం కాలంతో పోటీ పడి పని చేసే జర్నలిస్టులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మహిళలకు ఆర్టీసిలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే.

అక్రిడేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులకు 1/3 రాయితీతో ఇప్పటికే ఆర్టీసి ప్రయాణం కల్పిస్తున్నది. అయితే ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునే వారికి 1/2 రాయితీని మాత్రమే ఆర్టీసి కల్పిస్తున్నది. ప్రచారంలో 1/3 వంతు అని, అమలు మాత్రం 1/2 చేయడం పట్ల జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం ఆర్టీసి బీట్ జర్నలిస్టులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదు.

ఈ క్రమంలో పూర్తి రాయితీతో జర్నలిస్టులకు ఉచిత ప్రయాణం కల్పించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వృత్తి రీత్యా జర్నలిస్టులు జిల్లాలు దాటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక వైపు చాలీ చాలని జీతాలు, అరోవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..ఇబ్బందిగా మారాయి. కాబట్టి అక్రిడేషన్ తో సంబంధం లేకుండా, జర్నలిస్టులకు ఉచిత ప్రయాణం కల్పించి సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఆర్టీసీకి ఇది పెద్ద భారం కాదని భావిస్తున్నారు.

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో అక్రమ నియామకాలు!?

ఎన్పీడీసీఎల్ పై సీమాంధ్రులు పెత్తనం డైరెక్టర్ల నియామకంపై రగిలి పోతున్న విద్యుత్ ఉద్యోగులు సీనియారిటీని విస్మరించడంపై ఉద్యోగుల ఆసంతృప్తి తెలంగాణ కు చెందిన సీజీఎంలు డైరెక్టర్లకు అర్హులు కారా! ఇది ఆత్మగౌరవ సమస్య-...

బీఆరెస్‌ ప్రక్షాళన దిశగా కేసీఆర్ మేధో మథనం!

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందంటూ తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని గొప్పగా ప్రచారం చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ ఓటమిపాలైంది. దీనిపై అంతర్మథనం చెందుతున్న గులాబీ...

రైతుబంధు.. 20 లక్షల ఎకరాల వ్యవసాయేతర భూములకు!

ఆ భూముల్లో సాగు చేయ‌రు.. పంట‌లు పండవు.. వాటికి రైతులు య‌జ‌మానులు కారు! కానీ ప్ర‌తి ఏటా ఆ భూముల‌కు మాత్రం రైతుబంధు ప‌థ‌కం అమ‌ల‌వుతున్న‌ది. ఇలా వందెకరాలో, వేయి ఎక‌రాలో కాదు.....