Homeఆంధ్రప్రదేశ్ఎన్నో అవరోధాలను దాటి ప్రాణ ప్రతిష్ఠ వరకు..!

ఎన్నో అవరోధాలను దాటి ప్రాణ ప్రతిష్ఠ వరకు..!

Published on

మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి జన్మస్థలంలో నిర్మించిన ఆలయంలో మరికొద్ది గంటల్లోనే కొలువుదీరనున్నాడు. ఈ క్షణాల కోసం యావత్‌ దేశం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తున్నది. రాముడి జన్మభూమిలో ఆలయం చూడాలన్న హిందువుల ఎట్టకేలకు సాకారం కాబోతున్నది. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయగా.. మూడున్నరేళ్లలోనే ఆలయం రూపుదిద్దుకున్నది. నేడు ఆలయం బాల రాముడు భక్తులకు కటాక్షించనున్నాడు.అయితే, ఈ ఆలయ నిర్మాణం అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉండగా.. ఆలయ నిర్మాణానికి ఎన్నో పోరాటాలు జరిగాయి. అదే సమయంలో అయోధ్యను మరెన్నో వివాదాలు సైతం చుట్టుమట్టాయి. ఎట్టకేలకు వాటన్నింటిని దాటి రామయ్య ఆలయ శాశ్వత నిర్మాణం కల సాకారం కాగా.. కోట్లాది హిందువులకు ఆలయంలో బాల రాముడు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ క్రమంలో 1528 నుంచి ఇప్పటి వరకు అయోధ్య చుట్టూ జరిగిన కీలక పరిణామాలను ఓ సారి మననం చేసుకుందాం రండి..!

అయోధ్య వివాదం సరిగ్గా 1528 సంవత్సరం ప్రారంభమైంది. ఈ కాలంలో భారత్‌ మొఘలుల పాలనలో ఉండేది. అప్పటి మొఘలుల పాలకుడు బాబర్‌ కమాండర్‌ అయిన మీర్‌ బఖి అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించారు. రామాయణం ప్రకారం రాముడి జన్మస్థలం అయోధ్య రాముడిది. బాబ్రీ మసీదు ఎక్కడైతే నిర్మించారో సరిగ్గా అక్కడే బాల రాముడు జన్మించారని చెబుతుంటారు. అయితే, బాబర్‌ మసీదును నిర్మించగానే వివాదం మొదలైంది. 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు కొనసాగుతూ వచ్చాయి. ముఖ్యంగా 1853, 1859లో గొడవలు తారస్థాయికి చేరిన సమయంలో అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న ఆ ప్రాంతం చుట్టూ కంచెను ఏర్పాటు చేసింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు, బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

ఆ తర్వాత భారత్‌కు స్వతంత్రం సిద్ధించాక 1949లో అయోధ్య వివాదం మరింత ముదిరింది. బాబ్రీ మసీదులో బాలరాముడి విగ్రహం ఉందని చెప్పగా.. ఆ సమయంలో మతపరమైన ఘర్షణలు జరుగాయని భావించిన అప్పటి ప్రభుత్వం వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. దీంతో అక్కడ ఉన్న మసీదుకు తాళాలు పడ్డాయి. ఇక్కడ రామమందిరం నిర్మించాలంటూ విశ్వహిందూ పరిషత్ ఉద్యమాన్ని 1984లో ప్రారంభించింది. ప్రభూత్వం బాబ్రీ మసీదుకు వేసిన తాళాలను తొలగించాలని 1986 ఫిబ్రవరి 1న ఫైజాబాద్ జిల్లా జడ్జి ఆదేశించారు. హిందువులు సైతం లోపలకు వెళ్లి పూజలు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఆ సమయంలోనే బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం సైతం ఏర్పాటైంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దుతుగా 1990లో సోమనాథ్​ నుంచి బీజేపీ నేత ఎల్​కే అద్వానీ రథయాత్ర చేపట్టారు.

బాబ్రీ మసీదు స్థలంలో ఉన్న స్థలంఓల 2003లో భారత పురావస్తుశాఖ తవ్వకాలు చేపట్టింది. బాబ్రీ మసీదు కింద ఒక నిర్మాణం ఉండేది తేల్చారు. పురావస్తు శాఖ వాదనలతో ముస్లింలు విభేదించారు. 2010 లో వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పును వెలువరించింది. సున్నీ వక్ఫ్​బోర్డుకు, నిర్మోహీ అఖాడాకు, రామ్‌లల్లా తరఫు ప్రతినిధులకు కేటాయించాలని ఆ స్థలాన్ని కేటాయించాలని తీర్పు చెప్పింది. అయితే, అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేయగా.. 2011లో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆ తర్వాత 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదంపై కోర్టు పలుమార్లు విచారణ జరుపుతూ వచ్చింది. చివరకు 2019 నవంబర్‌ 9న వివాదస్పద స్థలంపై కీలక తీర్పును వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం కోసం ఓ ట్రస్టుకు కేటాయించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో వెల్లడించింది.మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే ప్రత్యామ్నాయ ప్రదేశంలో ఐదెకరాల ఎకరాల భూమిని కేటాయించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2020 ఫిబ్రవరి 5న రామాలయ నిర్మాణం, నిర్వహణకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు’ ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం ఈ ట్రస్టును ఏర్పాటు చేసింది.

ఎన్నో పోరాటాలు.. మరెన్నో వివాదాలను అధిగమించి.. కోర్టు తీర్పులతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమమైంది. దీంతో 2020 ఆగస్టు 5న రామజన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి దేశ, విదేశాల నుంచి విరాళాలను అయోధ్య మందిరం ట్రస్ట్‌ సేకరించింది. విరాళాల సేకరణకు భారీగా ఆదరణ లభించింది. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసుకోగా.. జనవరి 22, 2024న గర్భాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలని ముహూర్తం నిర్ణయించారు. ఈ వేడుకకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలను పంపారు. అలాగే పలు దేశాలకు చెందిన ప్రముఖులకు సైతం ఆహ్వానాలను పంపారు. ఆలయాన్ని ప్రారంభించి, బాల రాముడి విగ్రహానికి ప్రధాని ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది.

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో అక్రమ నియామకాలు!?

ఎన్పీడీసీఎల్ పై సీమాంధ్రులు పెత్తనం డైరెక్టర్ల నియామకంపై రగిలి పోతున్న విద్యుత్ ఉద్యోగులు సీనియారిటీని విస్మరించడంపై ఉద్యోగుల ఆసంతృప్తి తెలంగాణ కు చెందిన సీజీఎంలు డైరెక్టర్లకు అర్హులు కారా! ఇది ఆత్మగౌరవ సమస్య-...

జర్నలిస్టులకి ఆర్టీసి ఉచిత ప్రయాణం!?

రాత్రి పగలు తేడా లేకుండా సమాజ హితంకోసం కాలంతో పోటీ పడి పని చేసే జర్నలిస్టులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల...

బీఆరెస్‌ ప్రక్షాళన దిశగా కేసీఆర్ మేధో మథనం!

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందంటూ తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని గొప్పగా ప్రచారం చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ ఓటమిపాలైంది. దీనిపై అంతర్మథనం చెందుతున్న గులాబీ...