Homeఆంధ్రప్రదేశ్అచ్చు తప్పుతో శాస్త్రవేత్తలకు చిక్కిన ఖగోళ వింత.. ఏమా కథ!

అచ్చు తప్పుతో శాస్త్రవేత్తలకు చిక్కిన ఖగోళ వింత.. ఏమా కథ!

Published on

కో ఆర్డినేట్స్ ఇవ్వ‌డంలో అచ్చు త‌ప్పు… ఫ‌లితంగా శాస్త్రవేత్త‌ల‌కు చిక్కిన ఖ‌గోళ వింత‌ సుదూర విశ్వం (Space) లో ఉన్న ఓ భారీ గెలాక్సీ (Galaxy) అంత‌రిక్ష నియ‌మాల‌నే వెక్కిరిస్తున్న‌ట్లు శాస్త్రవేత్త‌ల‌కు క‌నిపిస్తోంది. భూమికి 270 మిలియ‌న్ కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఉన్న జేఓ613+52 అనే ఈ గెలాక్సీ… అస‌లు గెలాక్సీకి ఉండ‌వ‌ల‌సిన ప్రాథ‌మిక నియ‌మాన్ని పాటించ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను తోసిరాజేస్తూ.. ఈ గెలాక్సీలో అస‌లు న‌క్ష‌త్రాలే లేవు. పోనీ మ‌రో ర‌కంగా చెప్పాలంటే అవి మ‌న‌కు క‌న‌ప‌డ‌టం లేదు. ఇది త‌ప్ప ఒక గెలాక్సీకి ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ జేఓ613+52లో ఉన్నాయి. ఇక్క‌డ న‌క్ష‌త్రాల స్థానంలో ఇంట‌ర్ స్టెల్లార్ గ్యాస్ ఆ స్థానాన్ని ఆక్ర‌మించింది.

గ్రీన్ బ్యాంక్ అబ్జ‌ర్వేట‌రీ (Green Bank Observatory) కి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ క‌రెన్ ఓ నీల్ నేతృత్వంలో ఈ అధ్య‌య‌నాన్ని (Study) నిర్వ‌హించారు. ఆ వివ‌రాల ప్రకారం.. ఇటువంటి గెలాక్సీల‌ను ప్రైమోర్‌డియ‌ల్ గెలాక్సీల‌ని పిలుస్తారు. ఇటువంటి గెలాక్సీలు ఉంటాయ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు సిద్ధాంత‌ప‌రంగా అనుకోవ‌డ‌మే కానీ.. మ‌నం గ‌మ‌నించేంత ద‌గ్గ‌ర‌లోనే ఒక ప్రైమోర్‌డియ‌ల్ గెలాక్సీ ఉంద‌ని శాస్త్రవేత్త‌లు ఊహించ‌లేదు. ఈ త‌ర‌హా గెలాక్సీలు ఎక్కువ‌గా వాయువుల‌తోనే నిండిపోయి ఉంటాయి. ఈ విశ్వంలో స‌మ‌యం ఎప్పుడైతే మొద‌లైందో అప్ప‌టి నుంచే ఈ వాయువులు ఏర్ప‌డి ఉంటాయ‌ని శాస్త్రవేత్త‌ల ఊహ‌.

ఇంత అరుదైన వ‌స్తువును ప‌రిశోధ‌కులు అనుకోకుండానే గుర్తించ‌డం మ‌రో విశేషం. ఇంకా చెప్పాలంటే సిబ్బంది చిన్న పొర‌పాటు చేయ‌డం మూలాన జేఓ63+52 గెలాక్సీ శాస్త్రవేత్త‌ల కంట ప‌డింది. గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్‌ను స‌రైన కో ఆర్డినేట్స్ ఇవ్వ‌డంలో జ‌రిగిన అచ్చు త‌ప్పు వ‌ల్ల అది నిర్ణీత దిశ‌కు కాకుండా వేరే దిశ‌ను ప‌రిశీలిస్తూ ప‌రిశోధ‌న చేసి వివ‌రాల‌ను అందించింది. ఆ అధ్య‌య‌నంలో భాగంగానే జేఓ6131+52 గురించి తెలుసుకున్న‌ట్లు ఇటీవ‌ల జ‌రిగిన అమెరిక‌న్ ఆస్ట్ర‌నామిక‌ల్ సొసైటీ స‌మావేశంలో ఓ నీల్ వెల్ల‌డించారు. ‘ఇది వాయువుల‌తో నిండిపోయిన గెలాక్సీ. మ‌న పాల‌పుంత లోంచి న‌క్ష‌త్రాల‌ను తీసేస్తే ఎలా ఉంటుందో జేఓ631+52 అలా ఉంటుంది. అక్క‌డ అస‌లు న‌క్ష‌త్రాలైనా లేక‌పోయి ఉండాలి. లేదంటే మ‌న‌కు క‌నిపించ‌ని చిన్న ప‌రిమాణంలో అయినా ఉండాలి. ఏదైనా అద్భుత‌మే’ అని అన్నారు. గ్రీన్ బ్యాంక్ అబ్జ‌ర్వేట‌రీ సంస్థ ఎక్కువ‌గా లో స‌ర్ఫేస్ బ్రైట్‌నెస్ గెలాక్సీల గురించి ప‌రిశోధ‌న‌లు చేస్తుంది.

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో అక్రమ నియామకాలు!?

ఎన్పీడీసీఎల్ పై సీమాంధ్రులు పెత్తనం డైరెక్టర్ల నియామకంపై రగిలి పోతున్న విద్యుత్ ఉద్యోగులు సీనియారిటీని విస్మరించడంపై ఉద్యోగుల ఆసంతృప్తి తెలంగాణ కు చెందిన సీజీఎంలు డైరెక్టర్లకు అర్హులు కారా! ఇది ఆత్మగౌరవ సమస్య-...

జర్నలిస్టులకి ఆర్టీసి ఉచిత ప్రయాణం!?

రాత్రి పగలు తేడా లేకుండా సమాజ హితంకోసం కాలంతో పోటీ పడి పని చేసే జర్నలిస్టులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల...

బీఆరెస్‌ ప్రక్షాళన దిశగా కేసీఆర్ మేధో మథనం!

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందంటూ తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని గొప్పగా ప్రచారం చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ ఓటమిపాలైంది. దీనిపై అంతర్మథనం చెందుతున్న గులాబీ...