Homeచదువుఆ కళకు ఆయనే చివరి వారసుడు

ఆ కళకు ఆయనే చివరి వారసుడు

Published on

ఇప్పటి సమాజానికి తెలియని ఎన్నో కళలు ఉన్నాయి. అతి ప్రాచీన కళలకు గుర్తింపు లేక ఎన్నో అంతరించిపోతున్నాయి. అలాంటిది అంతరించిపోతున్న పాలమూరు పల్లె బుర్రవీణ వాయిద్య కళకు ఢిల్లీ గుర్తింపు లభించింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పను పద్మశ్రీ వరించింది. అంతరించిపోతున్న ప్రాచీన సంగీత వాయిద్యం బుర్రవీణ కళకు దాసరి కొండప్ప చివరి వారసుడు. రామాయణం, ఆధ్యాత్మిక, గ్రామీణ కథలను లయ బద్ధంగా పాడుతూ… తన బుర్రవీణ వాయిస్తూ కొండప్ప అబ్బురపరుస్తాడు. కొండప్ప గానం వింటే చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా మైమరిచిపోతారు.

కొండప్ప జీవనం దుర్భరం.

దామరగిద్ద గ్రామానికి చెందిన ఒలియ దాసరి కుటుంబానికి చెందిన కొండప్ప జీవనం దుర్భరం. తాతల కాలం నాటి బుర్రవీణ కళను నమ్ముకున్న ఆయన కుటుంబానిది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వంశపరంపర్యంగా వచ్చిన కళతో కథలు, పాటలు పాడుతూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబంలో రెండోవాడైన కొండప్ప తండ్రి, అన్నల నుంచి వారసత్వంగా బుర్రవీణ వాయిద్యంపై మంచి పట్టు సాధించాడు. తాతల కాలం నుంచే బుర్రవీణ వాయిద్యం వాయిస్తూ బిక్షాటన చేస్తూ కళనైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. అనంతరం కథలు, పాటలతో లయ బద్ధంగా బుర్రవీణ వాయిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రా, తెలంగాణతో పాటు కర్ణాటక ప్రాంతంలో తన కళను ప్రదర్శించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా బుర్రవీణ కళను మాత్రం వదలలేదు కొండప్ప. దాసరి కొండప్ప ప్రాచీన సంగీత వాయిద్య కళను గుర్తించి 2022లో రాష్ట్రస్థాయి పురస్కారం అందజేసింది. గవర్నర్ తమిళీ సై సౌందర్ రాజన్ చేతుల మీదుగా కొండప్ప అవార్డు అందుకున్నారు. అలాగే బలగం లో ‘అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే’ పాటకు కొండప్ప తన గాత్రాన్ని అందించాడు. ఈ పాట లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

కొండప్ప బుర్రవీణ వాయిద్యం ప్రత్యేకం

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో అక్రమ నియామకాలు!?

ఎన్పీడీసీఎల్ పై సీమాంధ్రులు పెత్తనం డైరెక్టర్ల నియామకంపై రగిలి పోతున్న విద్యుత్ ఉద్యోగులు సీనియారిటీని విస్మరించడంపై ఉద్యోగుల ఆసంతృప్తి తెలంగాణ కు చెందిన సీజీఎంలు డైరెక్టర్లకు అర్హులు కారా! ఇది ఆత్మగౌరవ సమస్య-...

జర్నలిస్టులకి ఆర్టీసి ఉచిత ప్రయాణం!?

రాత్రి పగలు తేడా లేకుండా సమాజ హితంకోసం కాలంతో పోటీ పడి పని చేసే జర్నలిస్టులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల...

బీఆరెస్‌ ప్రక్షాళన దిశగా కేసీఆర్ మేధో మథనం!

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందంటూ తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని గొప్పగా ప్రచారం చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ ఓటమిపాలైంది. దీనిపై అంతర్మథనం చెందుతున్న గులాబీ...