ఎన్పీడీసీఎల్ పై సీమాంధ్రులు పెత్తనం డైరెక్టర్ల నియామకంపై రగిలి పోతున్న విద్యుత్ ఉద్యోగులు సీనియారిటీని విస్మరించడంపై ఉద్యోగుల ఆసంతృప్తి తెలంగాణ కు చెందిన సీజీఎంలు డైరెక్టర్లకు అర్హులు కారా! ఇది ఆత్మగౌరవ సమస్య- వెంటనే మార్చాలని ముఖ్యమంత్రికి విన్నపం.. రెగ్యులర్ డైరెక్టర్ల కోసం తెలంగాణ వారికే అవకాశం ఇవ్వాలనీ కోరుతున్న ఉద్యోగులు.
టీఎస్ ఎస్పీడీసీఎల్ పై సీమాంధ్ర పెత్తనం ప్రారంభం అయింది. ఎస్పీడీసీఎల్లో ఇంత వరకు పని చె సిన డైరెక్టర్లను ప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో ఎస్పీడీసీఎల్లో పని చేస్తున్న సీజీఎంలను కొత్త వారి ఎంపిక పూర్తయ్యే వరకు తెలుగురు డైరెక్టర్లను నియమించింది. అందులో ముగ్గురు సీమాంధ్రకు చెందిన వారే కాకుండా తెలంగాణకు చెందిన సీజీఎం కన్న జూనియర్లు కావడంతో విద్యుత్ ఉద్యోగులు వారి నియామకంపై రగిలిపోతున్నారు. మింట్ కంపౌండ్తో పాటు విద్యుత్ ఉదో గులు ఎక్కడ కలిసిన సీమాంధ్ర ఉద్యోగులను డైరెక్టర్లుగా నియమించడంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం కనిపించింది.
తెలంగాణ కోసం సీమాంధ్ర ఉద్యోగులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో విద్యుత్ ఉద్యోగులు ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం వారినే తమ నెత్తిపై తెచ్చి పెడితే ఏలా పని చేయగలమని ఇది తమ ఆత్మాభిమానం దెబ్బ తీసినట్లేనని అంటున్నారు. ప్రస్తుతం నియమించిన వారి కన్న తెలంగాణకు చెందిన సీజీఎంలలో చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికి జూనియర్లను నియవి ఉంచడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పునారాలోచించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
అవగాహన లేని వారిని నియమించారనే విమర్శలు……
టీఎస్ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లుగా నియమించిన వారిలో కే. రాములుకు తప్ప మిగతా వారికి తెలంగాణ స్థాయి అవగాహన లేదని, ఇందులో ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించిన కే. నందకుమార్, ఆఫరేషన్ డై నర్సింలు జస్టిస్ ధర్మాధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు ఇటీవల ఇక్కడ చేరారని, వీరికి కీలకమైన హై పూర్తి అవగాహన లేదని విద్యుత్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లుగా వీరిని నియ కిస్తున్నట్లు విద్యుత్ ఉద్యోగులు పేర్కోంటున్నారు. తెలంగాణకు చెందిన వారిని ఎవరిని నియమించినా ఇది తమ ఆత్మగౌరవ సమస్యగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుర్తించి న్యాయం చేయాలని కోరుతునా కూడా తెలంగాణ వారికే అవకాశం ఇవ్వాలని, అవసరమైతే నోటిఫికేషన్లో స్వల్ప మార్పులు చేసి వారినే నియమించాలంటున్నారు. స్వరాష్ట్రా నికి చెందిన వారిని నియమిస్తు తమ రాష్ట్ర అభివృద్ధికి కృ సీఎం రేవంత్ రెడ్డిని విద్యుత్ ఉద్యోగులు కోరుతున్నారు.
సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న వేళ అప్పటి సమైక్యప్రభుత్వం ఎస్పీడీసీఎల్లో పుల్లారెడ్డిని డైరెక్టర్గా నియమించింది. అప్పుడు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున వ్యతిరేకించి పోరాటాలు చేయడంతో తప్పని కానీ ప్రస్తుతం తెలంగాణ పాలకులు తమ నెత్తిపై సీమాంధ్రకు చెందిన వారిని డైరెక్టర్లుగా నియంసంచడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఎస్పీడీసీఎల్లో డైరెక్టర్లుగా పని చేస్తున్న ఏడుగురిని ఇటీవల ప్రభుత్వం టర్మినెట్ చేసింది.
వారిస్థానంలో నలుగురిని తాత్కాలిక పద్ధతిలో నియమించారు. అందులో టర్మినెట్ చేసిన కమర్షియల్ డైరెక్టర్ కె.రాములును తిరిగి నియమించారు. ఇతనితో పాటు మరో ముగ్గురు సీజీఎంలను లూక్ ఆఫర్ డైరెక్టర్లుగా నియమించారు. వారు ముగ్గురు సీమాంధ్రకుచెందిన వారే కావడంతో ఎస్పీడీసీఎల్ విద్యుత్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కే. నందకుమార్ ను డైరెక్టర్బ్ ప్రాజెక్ట్స్గా. ఎస్. నర్సింలును డైరెక్టర్ ఆఫరేషన్గా, కే. సుధామాధురిని ఫైనాన్స్ డైరెక్టర్గా నియమించారు. వీరు ముగ్గురు కూడా సీమాంధ్రకు చెందిన వారే కాకుండా వీరి నియామాకం 1990 తర్వాత కాగా, వీరి కంటే సీనియర్ సీజీఎంలు తెలంగాణకు చెందినవారు. ఏడుగురు ఉండడం గమనార్హం.
వీరిలో నందకుమార్ 1990 బ్యాచ్కు చెందిన వారు కాగా, ఎన్ .నర్సింలు, కే.సుధామాధురి లు 1992 బ్యాచ్ వారని విద్యుత్ ఉద్యోగులు పేర్కోంటున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణకు చెందిన సాయిబాబ 1986 బ్యాచ్కు చెందిన వారు కాగా, చక్రపాణి, నర్సింహాస్వామి, బిక్షపతి, బాలస్వామి.పి. ఆనందు 1989 బ్యాచ్కు చెందిన వారు ఉన్నారు. ఎన్టీ వర్గానికి చెందిన ఎల్. పాండ్యానాయక్ 1990 బ్యాచ్కు చెందిన వారు ఉండగా సీమాంధ్రకు చెందిన జూనియర్లను ఏలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. వీరి నియమాకాన్ని తక్షణమే రద్దు చేసి తెలంగాణ వారిని మాత్రమే డైరెక్టర్లుగా నియమించాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.